‘సైకిల్’ చైన్ ని కేసీఆర్ ఎప్పుడో తెంచేశారు: పవన్ కల్యాణ్ సెటైర్లు
Add ap7am to your home Screen

‘సైకిల్’ చైన్ ని కేసీఆర్ ఎప్పుడో తెంచేశారు: పవన్ కల్యాణ్ సెటైర్లు

  • ‘సైకిల్’కు ట్యూబ్స్ లేవు
  • వైసీపీ అభ్యర్థులకు టికెట్లు ఎందుకు? 
  • క్లబ్ లో కూర్చుని పేకాట ఆడుకోండి
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్థులపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ, ‘వాళ్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులా లేక బెట్టింగ్ రాయుళ్లా? మీకెందుకు ఎమ్మెల్యే టికెట్లు, క్లబ్ లో కూర్చొని పేకాట ఆడుకోండి. పోలీసులను బెదిరించే వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారా?’ అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా సభకు హాజరైన అభిమానులు వేసిన ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వైసీపీ ఎన్నికల గుర్తు అయిన ‘ఫ్యాన్’ కు రెక్కలు విరగలేదు, అది తిరగడానికి ‘పవర్’ లేదు అని చెప్పడంతో చప్పట్లు మార్మోగిపోయాయి. ‘సైకిల్’కు ట్యూబ్స్ లేవని, ఇది వరకు సైకిల్ తొక్కుతూ వచ్చేవారని, ఇప్పుడు భుజాన వేసుకుని మోసుకొస్తున్నారంటూ టీడీపీపై సెటైర్లు విసిరారు. వాళ్లు సైకిల్ ఎందుకు తొక్కట్లేదంటే, సైకిల్ చైన్ ని కేసీఆర్ ఎప్పుడో తెంచేశారని, చైన్ లేకుండా సైకిల్ తొక్కితే ఎక్కడికీ వెళ్లదు అక్కడే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Nellore
kovuru
janasena
Pawan Kalyan
kcr

More Telugu News