టికెట్ ఇస్తానని మోసం చేసిన పవన్ కల్యాణ్: రాజీనామా చేస్తున్నానన్న పామర్రు మాజీ ఎమ్మెల్యే
- నాదెండ్ల మనోహర్ పిలిస్తే వెళ్లాను
- 18న జనసేనలో చేరితే టికెట్ ఇస్తానని హామీ
- జాబితాలో పేరు చేర్చకుండా మోసం
తీరా జాబితాలో తన పేరు లేకపోవడంతో మనోహర్ కు ఫోన్ చేశానని, ఆయన సరిగ్గా స్పందించలేదని, పవన్ కార్యాలయం నుంచి పులిశేఖర్ అనే వ్యక్తి ఫోన్ చేసి, మాట్లాడాల్సివుందని, తనను ఆహ్వానిస్తే వెళ్లానని, ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూర్చున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. తనను మోసం చేసిన జనసేనకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, రాజకీయ భవిష్యత్తుపై కార్యకర్తలు, స్నేహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.