Mohan babu: మోహన్‌బాబు వల్లే దాసరి మనవడు రోడ్డున పడ్డాడు: దాసరి కోడలు సుశీల ఆగ్రహం

  • దాసరి పోగానే ఆస్తులు పంచుతానన్నారు
  • మొసలి కన్నీరు కారుస్తున్నారు
  • దాసరి గురువంటూనే మోసం చేశారు
శ్రీవిద్యానికేతన్ విద్యార్థులకు ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ చెల్లించడం లేదంటూ విద్యార్థులతో కలిసి నేడు ఏపీ ప్రభుత్వంపై ఆయన నిరసనకు దిగడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఏపీ ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, మరోవైపు దాసరి నారాయణరావు కోడలు సుశీల మోహన్‌బాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

దాసరి తన గురువంటూనే తమను మోసం చేశారని సుశీల మోహన్‌బాబుపై మండిపడ్డారు. దాసరి చనిపోగానే తమందరికీ ఆస్తులు పంచుతానని చెప్పి, నేటికీ పంచలేదని ఆరోపించారు. మోహన్‌బాబు కారణంగా దాసరి మనవడు రోడ్డున పడ్డాడని విమర్శించారు. దాసరి కుటుంబానికే న్యాయం చేయని మోహన్‌బాబు, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌పై మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ సుశీల విమర్శించారు.  
Mohan babu
Dasari
Suseela
Kutumba Rao
Sri vidyanikethan

More Telugu News