holi: హోలీ వేడుకల్లో మసూద్ అజార్ దిష్టిబొమ్మ దగ్ధం

  • ముంబై వర్లీలో వినూత్నంగా హోలికా దహనం
  • మసైద్, హఫీజ్, దావూద్ ల దిష్టిబొమ్మల దహనం
  • వందేమాతరం నినాదాలు
హోలీ పండుగ సందర్భంగా ముందు రోజు రాత్రి హోలికా దహనం చేయడం ఉత్తరాదిన ఒక సంప్రదాయం. ఈ ఏడాది కూడా హోలీ సంబరాలు ఉల్లాసంగా జరిగాయి. ముంబైలోని వర్లీ ప్రాంతంలో హోలికా దహనాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. పుల్వామాలో 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వందేమాతరం నినాదాలు చేస్తూ, తమ దేశ భక్తిని చాటుకున్నారు. మసూద్ తో పాటు దావూవ్ ఇబ్రహీం, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ల దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు.

ఈ సందర్భంగా శివసేన నేత ఒకరు మాట్లాడుతూ, రాక్షసులను అంతం చేయాలని అన్నారు. మన దేశంలో జరిగే ప్రతి ఉగ్రదాడికి వీరు ముగ్గురే కారణమని చెప్పారు. వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు.
holi
effigy
masood azhar
worli
mumbai

More Telugu News