ఇది అధికారికం... జనసేనలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
Add ap7am to your home Screen

ఇది అధికారికం... జనసేనలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!

  • తెలుగుదేశం పార్టీలో చేరుతారని వార్తలు
  • స్వయంగా ఖండించిన లక్ష్మీనారాయణ
  • ఈ ఉదయం 10.30కి జనసేనలోకి
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీలో చేరనున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన అధికార టీడీపీలో చేరుతారని వార్తలు రాగా, వాటిని లక్ష్మీనారాయణే స్వయంగా ఖండించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఆయనకు భీమిలి టికెట్ ను ఖరారు చేసిందని కూడా వార్తలొచ్చాయి.

టీడీపీలో తాను చేరడం లేదని చెప్పిన లక్ష్మీనారాయణ, నేడు జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాను జనసేనలో చేరనున్నట్టు లక్ష్మీనారాయణ మీడియాకు తెలిపారు.
CBI
Ex JD
Lakshminarayana
Jana Sena
Pawan Kalyan

More Telugu News