పూర్తయిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలుపొందిన అభ్యర్థులు వీరే!

  • మజ్లిస్ నుంచి మీర్జా రియాజ్ హసన్ విజయం
  • ఐదు స్థానాలకు ఆరుగురు పోటీ
  • ఓటింగ్‌కు కాంగ్రెస్, టీడీపీ దూరం
తెలంగాణ శాసనసభ్యుల కోటా మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ గెలుపొందగా.. మజ్లిస్ నుంచి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధించినట్టు ఈసీ పేర్కొంది. నేటి ఉదయం జరిగిన పోలింగ్‌లో టీఆర్ఎస్‌కు చెందిన 91 మంది, ఎంఐఎంకు చెందిన 7గురు ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓటింగ్‌కు కాంగ్రెస్, టీడీపీలు దూరంగా ఉన్నాయి. దీంతో అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే అయింది.
Go Back to Shorts
Satyavathi Rathod
Mirza Riyaj Hassan
Mahamood Ali
Seri Subhash Reddy
Egge Mllesam

More Telugu News