ఆ భూములు కొంటే ఇప్పుడు కోటీశ్వరుడిని అయ్యేవాడిని: 'పెళ్లి' పృథ్వీరాజ్

12-03-2019 Tue 11:57 | Entertainment
  • ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది
  •  స్థలాలు కొనడానికి ప్రయత్నించాను
  •  ఫ్లాట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న 'పెళ్లి' పృథ్వీరాజ్, తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ''కెరియర్ తొలినాళ్లలో నేను చేసిన ఒక సినిమా వలన నా చేతికి ఒకేసారి పెద్ద అమౌంట్ వచ్చింది. ఆ డబ్బుతో శంషాబాద్ దగ్గర స్థలాలు కొనాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశాను. ఓ 100 ఎకరాలు అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఒకతను నన్ను తీసుకుని వెళ్లాడు .. ఆ సమయంలో నాతో పాటు మా డ్రైవర్ కూడా వున్నాడు.

ఆ స్థలాలకి సంబంధించిన వ్యక్తి ఆ 100 ఎకరాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వున్నది చూపించాడు. నేను తీసుకుందామనే ఫిక్స్ అయ్యాను. అయితే 100 ఎకరాలకు ఫెన్సింగ్ వేయించడానికి, ప్రస్తుతం తాము పెడుతున్న పెట్టుబడికి మించి అవుతుందని మా డ్రైవర్ చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాను. ఆ డబ్బుతో హైదరాబాద్ లో ఓ అపార్ట్ మెంటులో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. అప్పట్లో ఆ 100 ఎకరాలు తీసుకుని ఉంటే .. ఈ రోజున కోటీశ్వరుడిని అయ్యేవాడిని" అని చెప్పుకొచ్చారు.
Prudhvi Rajali

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more