నాలుగో వన్డేలో భారత్ కు షాకింగ్ ఓటమి... టర్నర్ మెరుపుదాడి

10-03-2019 Sun 22:00 | Sports
  • 4 వికెట్ల తేడాతో ఆసీస్ అద్భుత విజయం
  • 359 టార్గెట్ ను ఉఫ్ మని ఊదేసిన కంగారూలు
  • హ్యాండ్స్ కోంబ్ శతకం
ఒకప్పటితో పోలిస్తే క్రికెట్ ఆడే తీరులో ఎంతో మార్పు కనిపిస్తోంది. 300 పైచిలుకు స్కోర్లు కూడా ఎంతమాత్రం సురక్షితం కావు అని ఈమధ్య వస్తున్న మ్యాచ్ ఫలితాలు నిరూపిస్తున్నాయి. తాజాగా, టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో ఇలాంటి ఫలితమే వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.

చాన్నాళ్ల తర్వాత ఫామ్ లోకి వచ్చిన ఓపెనర్ శిఖర్ ధావన్ 115 బంతుల్లో 143 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (95) ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. లక్ష్యం చూస్తే 359 పరుగులు.. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్!... ఈ దశలో ఆ జట్టు గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే, ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్ కోంబ్ అద్భుత పోరాటంతో మ్యాచ్ ను దిశ మళ్లించారు.

ఖవాజా 91 పరుగులు చేయగా, హ్యాండ్స్ కోంబ్ 117 పరుగులు సాధించాడు. అయితే ఈ జోడీ అవుటవడంతో మ్యాచ్ పై భారత్ కు ఆశలు కలిగినా, ఆస్టన్ టర్నర్ ఆ ఆశలపై ఓ సుడిగాలి ఇన్నింగ్స్ తో నీళ్లు చల్లాడు. టర్నర్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో మెరుపువేగంతో 84 పరుగులు సాధించి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు టర్నర్ నే వరించింది. ఈ మ్యాచ్ విజయంతో ఐదు వన్డేల సిరీస్ ను 2-2తో సమం చేసింది ఆసీస్. ఇక, ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఢిల్లీలో మార్చి 13న జరగనుంది.
IndiaAustraliaCricket

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more