మరో హారర్ మూవీలో తమన్నా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో హారర్ మూవీలో తమన్నా

  • హారర్ థ్రిల్లర్ గా 'దేవి' చేసిన తమన్నా
  • ఓంకార్ కథకి గ్రీన్ సిగ్నల్ 
  • త్వరలోనే పూర్తి వివరాలు    
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో గ్లామరస్ కథానాయికగా తమన్నాకి మంచి క్రేజ్ వుంది. అలాంటి తమన్నా ఒక వైపున మోడ్రన్ లేడీగా .. మరో వైపున పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూ తమిళంలో 'దేవి' సినిమా చేసింది. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లో చేసిన ఈ హారర్ థ్రిల్లర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఆమె మరో హారర్ థ్రిల్లర్ మూవీలో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి .. ఆ హారర్ థ్రిల్లర్ మూవీనే 'రాజుగారి గది 3'. యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి గతంలో తెరకెక్కించిన 'రాజుగారి గది' విజయాన్ని అందుకుంది. ఆ తరువాత చేసిన 'రాజుగారి గది 2' ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని 'రాజుగారి గది 3' చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ కథను ఆయన తమన్నాకి వినిపించడం .. ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. పారితోషికం.. డేట్స్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
tamannah

More Telugu News