అల్లు శిరీష్ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు శిరీష్ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

  • అల్లు శిరీష్ నుంచి 'ఏబీసీడీ'
  • ఆకట్టుకుంటోన్న మాస్ బీట్
  •  శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ    
సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ 'ఏబీసీడీ' అనే సినిమా చేశాడు. మధుర శ్రీధర్ రెడ్డి .. యశ్ రంగినేని ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రుక్సార్ దిల్లోన్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

"ముంతకల్లు చేతబట్టి తాగుతుంటే నువ్వెత్తి .. ఒళ్లంతా మత్తెక్కి ఊగిపోదా ఓరబ్బీ .. జట్టుకట్టిపోదామా .. స్వర్గమే చూద్దామా .. చుక్కలన్నీ చుట్టీ దిగి కిందికి వద్దామా .. " అంటూ ఈ పాట సాగుతోంది. కల్లు దుకాణం నేపథ్యంలో సాగే పాట ఇది. జుడా శాండీ సంగీతం .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగున్నాయి. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ పాట .. వాళ్ల నుంచి ఎక్కువ మార్కులు కొట్టేస్తుందని చెప్పొచ్చు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అల్లు శిరీష్ ఆశిస్తోన్న హిట్ ఈ సినిమాతో దొరుకుతుందేమో చూడాలి.
allu sirish
rukshar

More Telugu News