పవన్ ను పల్లెత్తు మాట అనలేదు .. మహేశ్ చేసిన సాయం మరిచిపోలేను: 'బిగ్ బాస్' కౌశల్

  • పవన్ అంటే నాకెంతో అభిమానం
  • నాపై ఆయన ప్రభావం వుంది
  •  నాకెన్నో అవకాశాలు ఇప్పించారు
'బిగ్ బాస్ 2'లో కౌశల్ విజేతగా నిలవడానికి కారణమైన కౌశల్ ఆర్మీ, ఆయనపైనే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో .. ఒకానొక సందర్భంలో పవన్ కల్యాణ్ ను అవమానపరుస్తూ కౌశల్ మాట్లాడాడని కౌశల్ ఆర్మీలోని కొందరు సభ్యులు చెప్పడంతో, పవన్ అభిమానులు కౌశల్ పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం మొదలు పెట్టారు.

ఈ విషయంపై కౌశల్ స్పందిస్తూ .. "పవన్ కల్యాణ్ గారు అంటే నాకెంతో అభిమానం .. నా లైఫ్ స్టైల్ పై ఆయన ప్రభావం ఎంతో వుంది. ఆయన నాకు ఎన్నో అవకాశాలను ఇప్పించారు. 'బిగ్ బాస్ 2' విజేతగా నిలిచిన తరువాత, నేను పవన్ కల్యాణ్ గారిని కలుసుకోవడానికి ఎంతగా ప్రయత్నించానో ఆయన సిబ్బందికి తెలుసు. అలాంటి వ్యక్తిని అవమానపరుస్తూ నేనెందుకు మాట్లాడతాను? ఆయన అభిమానులను రెచ్చగొట్టడానికి కొంతమంది చేస్తోన్న పని ఇది. ఒక్క పవన్ కల్యాణ్ గారే కాదు .. మహేశ్ బాబు గారు కూడా నాకెంతో హెల్ప్ చేశారు. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం" అని చెప్పుకొచ్చాడు. 
Go Back to Shorts
kaushal

More Telugu News