‘బిగుస్తున్న ‘క్యూ నెట్' ఉచ్చు.. బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘బిగుస్తున్న ‘క్యూ నెట్' ఉచ్చు.. బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు!

  • షారూక్, బోమన్ ఇరానీ, పూజా హెగ్డేకు నోటీసులు
  • టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ కు కూడా
  • వారం రోజుల్లోగా పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు
దేశ వ్యాప్తంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట ‘క్యూనెట్’ ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ‘క్యూనెట్’ కేసులో పలువురు ప్రముఖులకు ఉచ్చు బిగుస్తోంది. పలువురు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లకు, క్రికెటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాలీవుడ్ అగ్ర నటుడు షారూక్ ఖాన్, అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, పూజా హెగ్డే, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్, క్రికెటర్ యువరాజ్ సింగ్ కు తాజాగా నోటీసులు జారీ అయినట్టు సమాచారం.

నోటీసులు అందుకున్న ప్రముఖులందరూ వారం రోజుల్లోగా పోలీసుల ఎదుట హాజరు కావాలని, లేనిపక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా, మొత్తం ఐదు వందల మందికి సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ‘క్యూ నెట్’కు ప్రచారం చేసి కస్టమర్లను ఆకర్షించేలా చేసిన వారు కూడా నేరస్తులేనని పోలీసులు అంటున్నారు. ‘క్యూ నెట్’ ద్వారా లబ్ధి పొందిన వారిని కూడా విచారణకు పోలీసులు పిలిచినట్టు సమాచారం.
q-net
Bollywood
Tollywood
Shahrukh Khan
puja hegde
bomman irani
allu sirish

More Telugu News