ఆ పథకాలన్నీ కేంద్రానివే.. చంద్రబాబు స్టిక్కర్ బాబులా మారిపోయారు: జీవీఎల్
- కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ వేస్తున్నారు
- ఏపీ అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్రానివే
- రైతులు కాని వారి అకౌంట్లలోకి డబ్బులు వెళుతున్నాయి
కేంద్రం చేస్తున్న ప్రతి పనికి రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ వేసుకుంటున్నారని జీవీఎల్ అన్నారు. చంద్రబాబు స్టిక్కర్ బాబులా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్రానివే అని చెప్పారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో నిజమైన రైతులకు అన్యాయం జరుగుతోందని... రైతులు కానీ వారి అకౌంట్లలోకి డబ్బులు వెళుతున్నాయని ఆరోపించారు.