ఎన్నారైగా అనుష్క . . ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అంజలి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నారైగా అనుష్క . . ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అంజలి

  • అనుష్క ప్రధాన పాత్రధారిగా 'సైలెన్స్'
  • సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంగా సాగే కథ
  • విదేశాల్లో ఎక్కువభాగం చిత్రీకరణ  
బలమైన కథాకథనాలు .. పాత్రలో కొత్తదనం ఉంటేనే అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ కారణంగానే 'భాగమతి' తరువాత ఆమె మరో ప్రాజెక్టును ఓకే చేయడానికి ఆలస్యమైంది. ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతోంది. కథాపరంగా ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మైఖేల్ మాడిసన్ అనే హాలీవుడ్ నటుడితో పాటు, అంజలి .. షాలిని పాండే .. మాధవన్ .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

 అనుష్క ఎన్నారై యువతిగా .. అంజలి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపిస్తారట. మార్చి నుంచి ఈ సినిమా షూటింగు విదేశాల్లో జరగనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాతో అనుష్క ఖాతాలో మరో భారీ విజయం చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు.
anushka

More Telugu News