'ఆర్ ఎక్స్ 100' బ్యూటీని అసలు సంప్రదించనేలేదట!
- సెట్స్ పైకి వెళ్లే దిశగా 'మన్మథుడు 2'
- పాయల్ ను ఎంపిక చేశారంటూ టాక్
- మార్చి 12వ తేదీన సినిమా లాంచ్
చాలా తక్కువ సమయంలోనే అమ్మడు నాగార్జున సరసన నాయికగా ఛాన్స్ కొట్టేసిందని అంతా అనుకున్నారు. అయితే ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. 'మన్మథుడు 2' సినిమా టీమ్ అసలు ఈ సుందరిని సంప్రదించనే లేదట. ఇప్పటివరకూ జరిగిన ప్రచారం పుకారు మాత్రమేనని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా అనుష్క పేరు వినిపిస్తోంది. అందులో వాస్తవమెంతన్నది చూడాలి. మార్చి 12వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. అప్పటికి అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.