అందులో ఎటువంటి సందేహం లేదు.. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇమ్రాన్ వ్యాఖ్యలకు అఫ్రిది మద్దతు
- భారత్ దాడిచేస్తే తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమన్న ఇమ్రాన్
- దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరిక
- చేతులు ముడుచుకుని కూర్చోమన్న అఫ్రిది
ఇమ్రాన్ వ్యాఖ్యలకు స్పందించిన అఫ్రిది ఈ మేరకు ట్వీట్ చేశాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదంటూ రెచ్చగొట్టే ట్వీట్ చేశాడు. పాకిస్థాన్‌తో చర్చలు అనవసరమని, యుద్ధమే పరిష్కారమని పుల్వామా ఘటన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ చేసిన ట్వీట్‌కు ‘అతడికేమైంది?’ అని ముక్తసరిగా సమాధానం ఇచ్చిన అఫ్రిది.. ఇప్పుడు పాక్ ప్రధానికి వంత పాడడం గమనార్హం.