యాక్షన్ హీరోకి అక్క పాత్రలో రేణుదేశాయ్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాక్షన్ హీరోకి అక్క పాత్రలో రేణుదేశాయ్?

  • వంశీకృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ
  • 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ అంటూ టాక్
  •  నటన వైపుకు రేణు దేశాయ్ దృష్టి
తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన రేణు దేశాయ్, పవన్ తో వివాహమైన తరువాత నటన వైపు వెళ్లలేదు. ఆ తరువాత ఆమె దర్శక నిర్మాతగా తన అభిరుచికి తగిన సినిమాలను మరాఠీలో చేస్తూ వచ్చారు. అలాంటి రేణుదేశాయ్ తెలుగులో ఒక సినిమాలో కీలకమైన పాత్రను చేయడానికి అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా దర్శకుడు వంశీకృష్ణ ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఇది 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోకి అక్క పాత్రలో రేణు దేశాయ్ నటించనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దర్శక నిర్మాతగా సక్సెస్ కాకపోవడం వల్లనే తిరిగి ఆమె నటన వైపు దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే తల్లి పాత్రలతో నదియా .. ఖుష్బూ .. రమ్యకృష్ణ వంటి సీనియర్ హీరోయిన్స్ బిజీ అయ్యారు. ఇక స్నేహా .. భూమిక వదిన పాత్రల్లో మెప్పిస్తున్నారు. రేణు దేశాయ్ కూడా బిజీ అవుతుందేమో చూడాలి. 
renu desai

More Telugu News