డ్యాన్సర్ తో కలిసి బీజేపీ ఎమ్మెల్యే అసభ్య నృత్యం.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు!
- మహారాష్ట్రలోని అమ్రావతిలో ఘటన
- ఎన్ఏడీసీ కార్యక్రమంలో బీజేపీ నేత అనిల్ చిందులు
- తన చర్యను సమర్థించుకున్న ఎమ్మెల్యే
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఎమ్మెల్యే తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే తన చర్యను బీజేపీ ఎమ్మెల్యే అనిల్ బోండే మాత్రం సమర్థించుకున్నారు. ఇది సంప్రదాయ నృత్యం ‘దంధర్’లో భాగమని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా ఓ పురుషుడు మహిళా వస్త్రధారణలో డ్యాన్స్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు ఎవరూ హాజరు కాలేదనీ, అలాంటప్పుడు అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు.