పవన్ కల్యాణ్ కోసం సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తా!: తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు
- పోరాడే నాయకుడి కోసం ప్రజల ఎదురుచూపు
- యువత, మహిళల కోసం రేయింబవళ్లు పనిచేస్తున్నారు
- జనసేనానిని ప్రశంసించిన తమిళనాడు మాజీ సీఎస్
యువత, పేదలు, మహిళల సంక్షేమం కోసం పవన్ రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని రామ్మోహన్ రావు కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ అన్న చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులతో తనకు పరిచయం ఉందని తెలిపారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం అన్నది చారిత్రక అవసరమని వ్యాఖ్యానించారు. పవన్ కోసం సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తానని హామీ ఇచ్చారు. పవన్ ను సీఎం పదవిలో చూడటానికి తనతో పాటు ప్రజలు ఆసక్తిగా ఉన్నారన్నారు.