ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న తెలంగాణ నేత.. జనసేన మద్దతు?
- 2014లో భద్రాచలం నుంచి గెలిచిన సున్నం రాజయ్య
- ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరం
- రంపచోడవరం నుంచి బరిలోకి?
వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నుంచి రాజయ్య సీపీఎం అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. తమతో కలిసి వస్తున్న వామపక్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో రెండు సీట్లు ఇవ్వాలని పవన్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో రంపచోడవరం నుంచి సున్నం రాజయ్య, పి.గన్నవరం నుంచి సీపీఐ అభ్యర్థిగా తాటిపాక మధు నిలబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.