బన్నీ స్క్రిప్ట్ పై కసరత్తు పూర్తి చేసిన త్రివిక్రమ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బన్నీ స్క్రిప్ట్ పై కసరత్తు పూర్తి చేసిన త్రివిక్రమ్

  • బన్నీతో త్రివిక్రమ్ మూవీ
  • కథానాయికగా కైరా పేరు 
  • త్వరలోనే సెట్స్ పైకి    
అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. 'అరవింద సమేత'ను పూర్తి చేసిన తరువాత నుంచి, బన్నీ సినిమాకి సంబంధించిన కథపైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తూ వచ్చాడు. ఆ కథలో మార్పులు .. చేర్పులు చేయిస్తూ వచ్చిన బన్నీ మొత్తానికి కథను ఓకే చేసేశాడు.

ఆ తరువాత స్క్రిప్ట్ పై కూర్చున్న త్రివిక్రమ్ .. తాజాగా బన్నీకి వినిపించి, ఆయనతో ఓకే అనిపించేసుకున్నాడట. ఇక ఇప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. మిగతా నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపికపై త్రివిక్రమ్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. కథానాయికగా కైరా అద్వాని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకోనున్నట్టుగా సమాచారం. హారిక అండ్ హాసిని .. గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాతో బన్నీ .. త్రివిక్రమ్ హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.
trivikram
allu arjun

More Telugu News