జాతి వివక్ష వ్యాఖ్యల ఫలితం.. పాక్ క్రికెట్ కెప్టెన్ పై వేటు
- దక్షిణాఫ్రికా క్రికెటర్ పై సర్ఫరాజ్ జాతి వివక్ష వ్యాఖ్యలు
- నాలుగు మ్యాచ్ ల నిషేధం విధించిన ఐసీసీ
- తాత్కాలిక కెప్టెన్ గా షోయబ్ మాలిక్ నియామకం
మరోవైపు సర్ఫరాజ్ పై వేటు పడటంతో... దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మరో రెండు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లకు అతను దూరం కానున్నాడు. అతని స్థానంలో షోయబ్ మాలిక్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ సందర్భంగా షోయబ్ మాట్లాడుతూ, ఏం జరిగిందో మనందరికీ తెలుసని... దానిపై తాను స్పందించబోనని చెప్పాడు. తనకు కెప్టెన్ గా అవకాశం ఇచ్చారని... తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతానని తెలిపాడు.