చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారికకు పద్మశ్రీ.. ప్రశంసించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు!
- ఇది తెలుగు క్రీడాకారులందరికీ సత్కారం
- భవిష్యత్ లో హారిక మరిన్న విజయాలు సాధించాలి
- ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి
ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘పిన్న వయసులోనే చదరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మన గుంటూరు ఆడబిడ్డ @HarikaDronavali ను అభినందిస్తూ వారిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించటం తెలుగు క్రీడాకారులందరికీ జరిగిన సత్కారంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో మీరు మరెన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.