రేపటి నుంచి ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్న యనమల
- బడ్జెట్ రూపకల్పనపై సమావేశం
- 4 రోజుల పాటు ప్రీ బడ్జెట్ సమావేశాలు
- అన్ని శాఖల అధికారులతో చర్చ
బుధవారం హోం, పరిశ్రమలు, రెవెన్యూ, అటవీ, విద్యుత్, మునిసిపల్ శాఖాధికారులతోనూ.. గురువారం నాడు మానవ వనరులు, పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, ఇరిగేషన్, ఆరోగ్య శాఖాధికారులతో.. శుక్రవారం ఐటీ, ప్రణాళిక, సమాచార, పర్యాటక శాఖాధికారులతో యనమల సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం బడ్జెట్ రూపకల్పన విషయమై యనమల తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.