'ఊరంతా అనుకుంటున్నారు' టీజర్ రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఊరంతా అనుకుంటున్నారు' టీజర్ రిలీజ్

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • ఒక హీరోగా నవీన్ .. మరో హీరోగా అవసరాల
  • దర్శకుడిగా బాలాజీ సానల  
సీనియర్ నరేశ్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కొంతకాలం క్రితమే హీరోగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆయన తాజా చిత్రంగా 'ఊరంతా అనుకుంటున్నారు' రూపొందుతోంది. నవీన్ విజయ్ కృష్ణ .. అవసరాల శ్రీనివాస్ .. మేఘా చౌదరి .. సోఫియా సింగ్ ప్రధాన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాకి బాలాజీ సానల దర్శకత్వం వహిస్తున్నాడు.

నవీన్ విజయ్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా, కృష్ణ .. విజయ నిర్మల చేతుల మీదుగా ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయించారు. నవీన్ పై మాత్రమే కట్ చేసిన ఈ టీజర్ ను వదిలారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ .. టైటిల్ బాగుంటే సినిమా సగం సక్సెస్ అయినట్టే. పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ కథకి మంచి టైటిల్ దొరికింది. కథ వినగానే నరేశ్ ఓకే చెప్పేశాడంటే, ఈ సినిమాలో విషయం వుండే వుంటుందని స్పష్టమవుతోంది. ఈ సినిమాతో నవీన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.
naveen
avasarala

More Telugu News