ప్రభాస్ ను నా జీవితంలో కలవలేదు, మాట్లాడలేదు... నా పిల్లల మీద ప్రమాణం... ఇదే నిజం!: వైఎస్ షర్మిళ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ ను నా జీవితంలో కలవలేదు, మాట్లాడలేదు... నా పిల్లల మీద ప్రమాణం... ఇదే నిజం!: వైఎస్ షర్మిళ

  • నా నిజాయతీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు
  • నా గురించి నా దేవుడికి తెలుసు
  • ప్రభాస్ ను జీవితంలో ఎప్పుడూ కలవలేదు, మాట్లాడలేదు
"నేను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, నా నైతికతను, నా నిజాయతీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నా గురించి నాకు తెలుసు. నా దేవుడికి కూడా నా గురించి తెలుసు. కానీ, ఈ రోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది గనుక, మీ అందరి ముందుకు వచ్చి చెబుతున్నా.

ఏ ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారో... ఆ వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ కలవలేదు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి, నాకు ఏ సంబంధమూ లేదు. ఇది నిజం. ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. లేదు. అలా కాదు... మేం ప్రచారం చేస్తున్నదే నిజమని, ఈ ప్రచారాలు పుట్టిస్తున్నవారు నాలాగా ప్రమాణం చేసి చెప్పగలరా? లేదా, నాకు ఈ సంబంధిత వ్యక్తితో సంబంధం ఉందనిగానీ, నేను ఎప్పుడైనా ఈ వ్యక్తిని కలిశాననిగానీ, మాట్లాడాననిగానీ, రుజువులు, ఆధారాలు చూపించగలరా?

పుకార్లు పుట్టించి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దారుణం కాదా? ఇది దుర్మార్గం కాదా? నన్ను ప్రేమించే నా భర్త ఉన్నాడు. నా మీద ఆధారపడ్డ నా పిల్లలున్నారు. నా కుటుంబం ఉంది. మా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. నాతో పాటు వీళ్లందరినీ కూడా బాధపెట్టిన విషయమిది. పుకార్లను పుట్టించి, ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంత వరకూ సబబు? ఏమిటీ పైశాచిక ఆనందం? ఎందుకింత నీచానికి దిగజారుతారు? ఇలా పుకార్లు పుట్టించిన వాళ్లకు, వాళ్ల వెనకాల ఉన్న వాళ్లకు సిగ్గనిపించడం లేదా? ఇంత దిగజారుడుతనం అవసరమా?" అని నేటి ఉదయం హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను కలిసి వచ్చిన తరువాత షర్మిళ ప్రశ్నాస్త్రాలు గుప్పించారు.
Sharmila
Jagan
Prabhas
Hyderabad

More Telugu News