అఖిలప్రియ గన్ మెన్లను తిరస్కరించిన విషయం సీఎం దృష్టికి వెళ్లిందన్న హోంమంత్రి చినరాజప్ప!
- నంద్యాలలో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు
- సమస్య ఉంటే పెద్దల దృష్టికి తేవాలన్న హోంమంత్రి
- ఈ వివాదాన్ని సీఎం పరిష్కరిస్తారని వ్యాఖ్య
ఏపీ మంత్రి అఖిలప్రియ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని చినరాజప్ప అన్నారు. ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే పార్టీ, ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నంద్యాలలో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు, అఖిలప్రియ గన్ మెన్లను వెనక్కు పంపిన ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిందని పేర్కొన్నారు. ఈ సమస్యలను చంద్రబాబు పరిష్కరిస్తారని వ్యాఖ్యానించారు. కర్నూలులో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి ఈ మేరకు స్పందించారు.