జిల్లాల్లో పోరాట యాత్రలకు స్వస్తి చెప్పనున్న పవన్
- సమస్యలను తెలుసుకుంటూ పర్యటన
- పార్టీ కార్యాలయంలో అందుబాటులో పవన్
- నిర్ణయం తీసుకున్న జనసేనాని
ఇకపై జిల్లాల్లో పర్యటిస్తారు కానీ సమస్యలను తెలుసుకుంటూ వాటిపై స్పందిస్తూ ఆయన పర్యటన సాగనుంది. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పార్టీ కార్యాలయంలో కూడా పవన్ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలా జనసేన కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటూనే.. సంక్రాంతి నుంచి జిల్లాల్లో తిరగాలని పవన్ నిర్ణయించారు.