జనసేన బలమంతా కోస్తా జిల్లాల్లోనే ఉందని కొందరంటున్నారు.. అది నిజం కాదని నా కవాతు నిరూపించింది!: పవన్ కల్యాణ్
- నన్ను ఓ ప్రాంతానికే పరిమితం చేసే యత్నం తగదు
- బ్రిటిష్ హయాంలోనే అత్యధిక పనులు చెల్లించిన ప్రాంతమిది
- రాజకీయవెనుకబాటు తనం వల్లే ‘అనంత’ కరవు
ఈ సందర్భంగా అనంతపురం గురించి ప్రస్తావిస్తూ.. బ్రిటిష్ హయాంలోనే అత్యధిక పనులు చెల్లించిన ప్రాంతం అనంతపురం జిల్లా అని అన్నారు. ఇక్కడి కరవు సమస్యకు ఒక్క రోజులో పరిష్కారం చూపలేమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయవెనుకబాటు తనం వల్లే ఈ జిల్లాలో కరవుకి పరిష్కారం లభించలేదని విమర్శించారు. నీటి సమస్య వుండే ఇజ్రాయిల్ దేశంలో పుష్కలంగా పంటలు పండిస్తున్నారని, అనంతపురంలో మనం ఆ ప్రయోగం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు. పాలకులు సంకల్పించకపోవడం వల్లే దీనిపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు.