తన పెళ్లిపై కథనాన్ని చూసి.. వ్యంగ్యంగా స్పందించిన శ్రుతి హాసన్
- మైఖేల్‌తో ప్రేమలో ఉందని ప్రచారం
- ఖండించిన శ్రుతి
- మైఖేల్‌తో తీసుకున్న ఫోటోలను షేర్ చేసిన శ్రుతి
అయితే ఇటీవల ఆమె లండన్ వెళ్లారు. మైఖేల్‌తో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మైఖేల్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో శ్రుతి షేర్ చేసింది. దీంతో మళ్లీ శ్రుతి ప్రేమ, పెళ్లి ప్రచారం ఊపందుకుంది. ‘2019లో శ్రుతి పెళ్లంటూ ఓ వార్తాపత్రిక ఏకంగా కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తను రీ ట్వీట్ చేసిన శ్రుతి.. ‘నిజమా?.. ఇది నాకు వార్తే’ అంటూ వ్యంగ్యంగా స్పందించింది.