రామ్ చరణ్ తీసుకునే డైట్ ఇదే.. ఫిట్ నెస్, ఆరోగ్యం కోసం మీరు కూడా పాటించండి: ఉపాసన
- రామ్ చరణ్ తీసుకుంటున్న డైట్ వివరాలను వెల్లడించిన ఉపాసన
- ఏమి తీసుకోవాలి.. ఏం తీసుకోకూడదో చెప్పిన మిసెస్ చరణ్
- అందరూ పాటించాలంటూ సూచన
డైట్ వివరాలు ఇవే:
దూరంగా ఉంచాల్సినవి: కాఫీ, డైరీ ప్రాడక్ట్స్, రెడ్ మీట్, గోధుమలు, తీపి పళ్లు, ఆల్కహాల్.
తీసుకోవాల్సిన ప్రొటీన్ ఫుడ్: బేక్డ్, బాయిల్డ్ చికెన్, లెంటిల్స్, తోఫు, చేప.
కార్బొహైడ్రేట్ ఫుడ్ ఛాయిస్: క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్ మీల్, స్వీట్ పొటాటోస్.
వెజిటబుల్ ఛాయిస్: స్టీమ్ చేసిన లేదా దోరగా వేయించిన బీన్స్, ఆస్పరాగస్, బ్రాకోలీ. అన్నింటిలోకి వెల్లుల్లిని చేర్చుకోవడం మంచిది.
21 రోజుల నుంచి 45 రోజుల వరకు ఈ ప్రోగ్రాంను ఫాలో కావాలి. ప్రతి రోజు 12 గంటల పాటు ఉపవాసం (ఆహారం, ఇతర ద్రవ పానీయాలు తీసుకోవద్దు) ఉండాలి. మిగిలిన 12 గంటల సమయంలో మెనూలో సూచించిన ఆహారాన్ని తీసుకోవాలి. మిగిలిన 12 గంటల సమయంలో నీటిని మాత్రమే తీసుకోవాలి. ఇతర పానీయాలు తీసుకోరాదు. ఈ 12 గంటల సమయంలో మన శరీరంలోని విష పదార్థాలు వెలుపలికి వెళతాయి కాబట్టి... వీలైనంత ఎక్కువ నీటిని తాగవచ్చు. ఆల్కనైజ్డ్ వాటర్ అయితే మరీ మంచింది. ఈ సమయంలో పలుమార్లు బాత్ రూమ్ కు వెళ్లడం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ, మన శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తున్నాయనే విషయాన్ని గ్రహించండి. దీని వల్ల భయపడవద్దు, ఇబ్బందికి గురి కావద్దు.