కొందరు పిచ్చోళ్లు రాజమౌళిలాంటి పిచ్చోళ్లను నమ్ముతారు: ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొందరు పిచ్చోళ్లు రాజమౌళిలాంటి పిచ్చోళ్లను నమ్ముతారు: ప్రభాస్

  • ఐదేళ్ల పాటు ఒక సినిమాను తీయడం వెర్రితనమే
  • రాజమౌళిలో ఏదో సాధించాలనే తపన ఉంది
  • ఒక్క సినిమా కోసం అన్ని సంవత్సరాలు పని చేయడం సరికాదు
'బాహుబలి' సినిమా రెండు భాగాల కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించిన దర్శక దిగ్గజం రాజమౌళి అని ప్రభాస్ అన్నాడు. ఒక్క సినిమా కోసం అన్ని సంవత్సరాలు కేటాయించడం పిచ్చితనమేనని చెప్పాడు. ఏదో సాధించాలనే తపన ఉన్న రాజమౌళి వంటి పిచ్చోళ్లు  కొందరు ఉంటారని... మరికొందరు పిచ్చోళ్లు రాజమౌళిని నమ్ముతారని తెలిపాడు. ఒక్కో సినిమాకు ఐదేళ్లు కేటాయించలేమని... అలా చేస్తూ పోతే 3 లేదా 4 సినిమాలకే ముసలోళ్లం అయిపోతామని చెప్పాడు.

ఇన్నేళ్ల పాటు ఒక సినిమాను తీయడం నిజంగా వెర్రితనమేనని ప్రభాస్ అన్నాడు. ఏం జరగబోతోందో కూడా మనకు అర్ధం కాదని... కానీ, 'బాహుబలి'లో అది పని చేసిందని చెప్పాడు. అయితే, అన్ని సమయాల్లో అది పని చేస్తుందని చెప్పలేమని తెలిపాడు. డైరెక్టర్లు, నిర్మాతలు 80, 90 ఏళ్లు కూడా పని చేస్తారని... కానీ హీరో, హీరోయిన్లు అలా చేయలేరని చెప్పాడు. కొంత కాలం తర్వాత ఇతర పాత్రలు పోషించాల్సి ఉంటుందని తెలిపాడు. అందుకే ఒక్కో సినిమా కోసం 4, 5 ఏళ్లు పని చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
rajamouli
prabhas
tollywood

More Telugu News