హీరో చోరీ సీన్ 'సాహో'కి హైలైట్ గా నిలుస్తుందట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో చోరీ సీన్ 'సాహో'కి హైలైట్ గా నిలుస్తుందట

  • షూటింగ్ దశలో 'సాహో'
  • రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ 
  • ఆగస్టు 15వ తేదీన విడుదల
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 'సాహో' సినిమా రూపొందుతోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చోరీ సీన్ ఒకటి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఒక నగల షాపును కొల్లగొట్టేందుకు హీరో స్కెచ్ వేస్తాడు. తన ప్రమేయం లేకుండానే నగలన్నీ వచ్చి తన కారులో పడేలా తెలివిగా హీరో చేసిన ప్లాన్ చూసితీరవలసిందేనని చెబుతున్నారు.

'ధూమ్' సిరీస్ లోని చోరీ సీన్స్ కి మించి ఈ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన షాపింగ్ మాల్ సెట్లో ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించారట. ప్రభాస్ అభిమానులు విజిల్స్ వేసేలా ఈ సీన్ వచ్చిందని చెబుతున్నారు. ఇక యూరప్ లో చేయాలనుకున్న షెడ్యూల్ ను కూడా, ఫిల్మ్ సిటీలోనే సెట్స్ వేసి చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారట. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. 
prabhas
shraddhakapoor

More Telugu News