ఆడపిల్ల పుట్టిందని రెండో పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు.. ఇంటి ముందు బాధితురాలి ఆందోళన!

29-12-2018 Sat 09:45 | Telangana
  • తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం
  • అదనపు కట్నం కోసం వేధించిన అత్తారింటివారు
  • చివరికి అరెస్ట్ చేయించిన బాధితురాలు
ప్రాణం ఉన్నంతవరకూ తోడుగా ఉంటానని పెళ్లాడిన భర్త మాట తప్పాడు. ఆడపిల్ల పుట్టడాన్ని సాకుగా చూపుతూ అదనపు కట్నం కోసం వేధించసాగాడు. చివరికి మరో యువతిని వివాహం చేసుకుని ఆమెకు తీవ్ర అన్యాయం చేశాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కింది. అయినా నిందితుడికి శిక్ష పడకపోవడంతో చివరికి కుమార్తెతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని జమ్మికుంటకు చెందిన లాస్యకు గజ్జెల శివశంకర్ తో 2014లో వివాహం అయింది. పెళ్లి సమయంలో అమ్మాయి తరఫువారు  రూ.4 లక్షల కట్నం ఇచ్చుకున్నారు. కొత్తల్లో అంతా బాగానే ఉన్నప్పటికీ లాస్యకు పాప పుట్టడంతో సమస్యలు ప్రారంభం అయ్యాయి. అమ్మాయి పుట్టింది కాబట్టి అదనపు కట్నం తీసుకుని రావాలంటూ భర్త శివశంకర్ తో పాటు అత్తమామలు, ఆడపడుచులు వేధించడం మొదలుపెట్టారు. చివరికి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు.

ఈ సందర్భంగా లాస్య పుట్టింటికి వచ్చింది. అయితే తాను లేని సమయంలో భర్త నాగలక్ష్మి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని గతేడాది జూన్ 6న జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అధికారుల కౌన్సెలింగ్ విఫలం కావడంతో చివరికి భర్త సహా 9 మందిపై కేసు పెట్టింది. దీంతో అధికారులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి న్యాయం కోసం లాస్య కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. అయితే ఇప్పటివరకూ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, చిన్నారితో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళనను విరమించింది.
TelanganaMancherial Districtdowreyvictimgirl childPolice

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more