పూరితో కలిసి రంగంలోకి దిగుతోన్న రామ్
Add ap7am to your home Screen

పూరితో కలిసి రంగంలోకి దిగుతోన్న రామ్

  • పూరి దర్శకత్వంలో రామ్
  • జనవరిలో సెట్స్ పైకి 
  • మే నెలలో విడుదల  
హీరో రామ్ కి యూత్ లో మంచి క్రేజ్ వుంది. అలాంటి రామ్ కి 'నేను శైలజ' తరువాత ఇంతవరకూ హిట్ లేదు. దాంతో ఆయన మంచి కథ కోసం వెయిట్ చేస్తూ కొంత గ్యాప్ తీసుకున్నాడు. రీసెంట్ గా పూరి జగన్నాథ్ ఒక కథ వినిపించగా, రామ్ కి ఆ కథ బాగా నచ్చేసింది. దాంతో ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులతోనే ఇప్పుడు పూరి ఫుల్ బిజీగా వున్నాడు.

జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పూరి సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాలో రామ్ జోడీ కట్టేదెవరూ .. ప్రతినాయకుడిగా కనిపించేదెవరూ వంటి వివరాలతో పాటు మిగతా విషయాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత పూరి తన తనయుడు ఆకాశ్ హీరోగా మరో సినిమా చేయనున్నాడు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు కూడా నడుస్తూనే వున్నాయి. 
puri
ram

More Telugu News