అనుష్కతో డేటింగ్ లో లేను.. కావాలంటే రాజమౌళిని అడగండి!: హీరో ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్కతో డేటింగ్ లో లేను.. కావాలంటే రాజమౌళిని అడగండి!: హీరో ప్రభాస్

  • కలిసి నటిస్తే రూమర్స్ వస్తూనే ఉంటాయి 
  • మా మధ్య అలాంటిదేం లేదు 
  • అనుష్క నాకు మంచి స్నేహితురాలు  
ప్రభాస్ .. అనుష్క జోడీకి 'బాహుబలి' సినిమా నుంచి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారనీ, పెళ్లి చేసుకునే ఆలోచనలో వున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అనుష్క ఖండించినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో కరణ్ జొహార్ నిర్వహిస్తోన్న పాప్యులర్ షో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో తాజాగా ప్రభాస్ .. రానా .. రాజమౌళి పాల్గొన్నారు.

'అనుష్కతో డేటింగ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మీ సమాధానం ఏమిటి?' అనే ప్రశ్న కరణ్ జొహార్ నుంచి ప్రభాస్ కి ఎదురైంది. అందుకు ప్రభాస్ స్పందిస్తూ .. "ఏ ఇద్దరు హీరో హీరోయిన్లైనా రెండేళ్లు కలిసి పనిచేస్తే సహజంగానే వాళ్లిద్దరికీ లింక్ పెట్టేసి ప్రచారం చేస్తుంటారు. నిజం చెప్పాలంటే నాకు, అనుష్కకి మధ్య అలాంటిదేం లేదు. మేమిద్దరం డేటింగ్ చేస్తున్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు .. కావాలంటే రాజమౌళి గారిని అడగండి" అన్నాడు. 'బాహుబలి'లో మీకు అనుష్క భార్యగాను .. తల్లిగాను కూడా నటించారు .. ఇది కొంచెం కష్టమే' అని కరణ్ అనగా, "అవును .. అలాంటప్పుడు ఆమెతో డేటింగ్ ఎలా చేస్తాను? అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే" అని ప్రభాస్ పేర్కొన్నాడు.    
prabhas
anushka

More Telugu News