మోస్ట్ వాంటెడ్ చెడ్డీ-బనియన్ గ్యాంగ్ అరెస్ట్.. 8 ఏళ్లుగా ఏపీ పోలీసులకు చుక్కలు చూపించిన ముఠా!
- గుజరాత్ లోని దహోద్ కేంద్రంగా కార్యకలాపాలు
- ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 40 చోరీలు
- పరారీలో ఐదుగురు ముఠా సభ్యులు
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ముఠాలో ఇంకా ఐదుగురు సభ్యులు ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్న వీరి కోసం గాలింపు ప్రారంభించామని చెప్పారు. ఈ చెడ్డీ బనియన్ గ్యాంగ్ సభ్యులు గుజరాత్ లోని దహోద్ జిల్లాకు చెందినవారని పేర్కొన్నారు. నిందితుల నుంచి బంగారు నగలు, వెండితో పాటు కారు, రెండు బైక్ లు, ఓ రాడ్డును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిపై 40 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.