కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు!
- అందరు హీరోల కంటే కేసీఆర్ హ్యాండ్ సమ్ గా ఉంటారు
- చంద్రబాబు కంటే కేసీఆర్ 2000.0 రెట్లు ఎక్కువ
- పటేల్ కంటే 2.0 రెట్లు పెద్దదైన కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలి
ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందిస్తూ, ఆ విషయం తనకెప్పుడో తెలుసంటూ రీట్వీట్ చేశారు. 'ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది రాము గారు' అంటూ వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా.... ఆ విషయం తనకు అర్థం కాలేదనే విషయం అర్థమవుతోందని వర్మ చెప్పారు.
'మీకు, మీ నాన్నకు 2.0 బిలియన్ ఛీర్స్' అని తెలిపారు. అందరు హీరోయిన్ల కంటే కేసీఆరే అందంగా ఉంటారని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని... కానీ ఇప్పుడు అందరు హీరోల కంటే కేసీఆర్ హ్యాండ్ సమ్ గా ఉంటారని, హిమాలయాలకంటే ఆకర్షణీయంగా ఉంటారని చెబుతున్నానని అన్నారు. గుజరాత్ లో అతి పెద్ద పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఏర్పాటు చేశారని... తెలంగాణలో 2.0 రెట్ల పెద్దదైన కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని సూచించారు.