లగడపాటి చెప్పిందే జరగబోతోంది... కారణమేంటంటే...!: బుద్దా వెంకన్న వివరణ
- తెలంగాణలో ప్రజాకూటమిదే విజయం
- జాతీయ మీడియా సర్వేలు పాతవి
- చంద్రబాబు ప్రచారానికి వచ్చాక పరిస్థితి మారింది
- టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
చంద్రబాబు తెలంగాణకు వెళ్లి ప్రచారం చేయడం, ఆపై రాహుల్ గాంధీతో కలసి ఒకే వేదికపై కనిపించడం వంటి కారణాలతో ఓటర్లు ప్రజా కూటమివైపు మొగ్గారని అన్నారు. తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలని చంద్రబాబు తపిస్తుంటే, కేసీఆర్ ఆయన్ను తిట్టడం ప్రజలకు నచ్చలేదని అన్నారు. మాజీ ఎంపీ రాజగోపాల్ సర్వే క్షేత్రస్థాయిలో జరుగుతుందని, ఎన్నికలు ముగిసి పోలింగ్ ముగిసేంత వరకూ ఆయన సర్వే జరుగుతుందని, అందువల్ల తాను దాన్నే నమ్ముతున్నానని అన్నారు. గతంలో లగడపాటి చెప్పిన ఎన్నో సర్వేలు నిజమైన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. టీఆర్ఎస్ నేతల ఆనందం మూన్నాళ్ల ముచ్చటేనని జోస్యం చెప్పారు.