'మారి 2' ట్రైలర్ తో అదరగొట్టేస్తోన్న ధనుశ్
- బాలాజీ మోహన్ నుంచి 'మారి 2'
- ఆటో డ్రైవర్ పాత్రలో సాయిపల్లవి
- ఈ నెల 21వ తేదీన విడుదల
మాస్ రాజాగా ధనుశ్ డిఫరెంట్ లుక్ తో .. స్టైల్ తో కనిపిస్తూ ఉండగా, ఆటో డ్రైవర్ గా సాయిపల్లవి కనిపిస్తోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఈ ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతుందనే చెప్పాలి. 'మారి' మాదిరిగానే 'మారి 2' కూడా మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనుశ్ ఖాతాలో మరో హిట్ చేరిపోయినట్టేనని ఆయన అభిమానులు బలంగా చెబుతున్నారు.