శంకర్ ఎఫెక్ట్ .. చిన్నపిల్లాడిలా మారిపోయాను: హీరో నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంకర్ ఎఫెక్ట్ .. చిన్నపిల్లాడిలా మారిపోయాను: హీరో నాని

  • నిన్న '2.ఓ' సెకండ్ షో చూసిన నాని  
  • బాక్సాఫీస్ కి దిగిపోద్ది 
  • పాత రికార్డులను తన్నేస్తుంది
శంకర్ .. రజనీకాంత్ కాంబినేషన్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్ల కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం ఎదురుచూడని వాళ్లంటూ వుండరు. అలాంటి అభిమానులలో హీరో నాని కూడా వున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన '2.ఓ' సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. నాని ఫస్టుడే .. ఫస్టు షోనే చూడాలనుకున్నాడు .. కానీ కుదరలేదు. ఆ విషయమై నిన్న ట్వీట్ చేసిన నాని, నిన్న రాత్రి ఆ సినిమా చూసిన తరువాత మరో ట్వీట్ చేశాడు.

నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకూ 'జెర్సీ' సినిమా షూటింగులో పాల్గొన్న ఆయన, '2. ఓ' సెకండ్ షోకి వెళ్లాడట. సినిమా చూసిన తరువాత ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. 'ఈ సినిమాతో బాక్సాఫీస్ కి దిగిపోద్ది' అన్నాడు. 'ఈ సినిమా చూస్తూ నన్ను నేను మరిచిపోయాను .. చాలా కాలం తరువాత చిన్నపిల్లాడిలా మారిపోయాను .. ఇందుకు కారణం శంకర్' అని చెప్పాడు. ఇంతవరకూ బాక్సాఫీస్ దగ్గర గల రికార్డులను ఈ సినిమా తన్నేస్తుంది' అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.    
rajani
akshay

More Telugu News