'2.ఓ' హిందీ వెర్షన్ తొలిరోజు వసూళ్లు 25 కోట్లు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'2.ఓ' హిందీ వెర్షన్ తొలిరోజు వసూళ్లు 25 కోట్లు?

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన '2.ఓ'
  • 'రోబో' హిందీ వెర్షన్ ఫుల్ రన్ వసూళ్లు 20 కోట్లు
  • మూడు భాషల్లో కొనసాగుతోన్న '2.ఓ' జోరు    
విభిన్నమైన కథలను ఎంచుకుని ఆ కథలను తెరపై భారీగా ఆవిష్కరించడం శంకర్ ప్రత్యేకత. వినోదం .. సాంకేతిక పరిజ్ఞానం .. సందేశం కలగలిసినవిగా ఆయన సినిమాలు ఉంటాయి. అలాంటి శంకర్ తాజా చిత్రంగా ఈ రోజునే '2.ఓ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ  .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఈ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ మూడు భాషల్లోను తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా హిందీ వెర్షన్ ను కరణ్ జొహార్ విడుదల చేశారు. గతంలో 'రోబో' సినిమా హిందీ వెర్షన్ ఫుల్ రన్ లో 20 కోట్లను వసూలు చేసింది. ఇక '2.ఓ' సినిమా హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజునే 25 కోట్లను వసూలు చేయడం ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. హిందీ వెర్షన్ కి సంబంధించి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ను దృష్టిలో పెట్టుకుని వాళ్లు ఈ మాట చెబుతున్నారు. తెలుగు .. తమిళ భాషల్లోను ఈ జోరు కొనసాగుతుందనే విషయం, ఆయా ప్రాంతాల నుంచి వస్తోన్న రెస్పాన్స్ ను బట్టి అర్థమవుతోంది.      
rajani
amy
akshay

More Telugu News