‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ కు బంపర్ ఆఫర్!
- శరవేగంగా సాగుతున్న బయోపిక్ షూటింగ్
- ఇప్పటికే ఖరారైన ప్రధాన పాత్రధారులు
- జనవరి 9న రిలీజ్ కు నిర్మాతల ఏర్పాట్లు
తాజాగా సహజ నటి జయసుధ పాత్రలో పాయల్ రాజ్ పుత్ ను తీసుకోవాలని క్రిష్ యోచిస్తున్నట్లు సమాచారం. పాయల్ ముఖకవళికలు, హావభావాలు జయసుధకు సరిగ్గా సరిపోతాయని భావించిన సినిమా నిర్మాతలు, దర్శకుడు పాయల్ ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్-జయసుధ కాంబినేషన్ లో గతంలో డ్రైవర్ రాముడు’, ‘గజదొంగ’, ‘మహా పురుషుడు’, ‘అడవి రాముడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగమైన ‘కథానాయకుడు’ సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేసేందుకు నిర్మాతలు చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.