చివరకు మా అమ్మను కూడా రాజకీయ బురదలోకి లాగారు: మోదీ
- నన్ను ఎదుర్కొనే దమ్ము లేక.. మా అమ్మను విమర్శిస్తున్నారు
- నాతో పోరాడటంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు
- కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చూడండి
నిన్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ మాట్లాడుతూ, మోదీపై విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు భారత రూపాయి విలువ ప్రధాని వయసుకు సమానంగా పతనమైందని విమర్శించేవారని అన్నారు. ఇప్పుడు మన కరెన్సీ విలువ మోదీ తల్లి వయసుకు చేరువవుతోందని విమర్శించారు. మోదీ తల్లి హీరాబెన్ వయసు 97 సంవత్సరాలు.