ప్రభాస్ ఖాతాలో చేరిన సరికొత్త రికార్డ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ ఖాతాలో చేరిన సరికొత్త రికార్డ్

  • మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ 
  • ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చిన 'బాహుబలి'
  • 'సాహో' షూటింగుతో బిజీ
మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, ఆ తరువాత యూత్ కి కనెక్ట్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. లవ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా చేరువయ్యాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేసిన 'బాహుబలి' .. ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిపెట్టింది. ఈ కారణంగానే ఆయన తదుపరి సినిమాలు వివిధ భాషల్లో విడుదలయ్యేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

అలాంటి ప్రభాస్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఒకటైన ఫేస్ బుక్ ను మాత్రమే వాడుతుంటాడు. ఇందులో ప్రభాస్ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్స్ కి చేరింది. చాలా తక్కువ టైమ్ లో ప్రభాస్ ఈ ఫీట్ ను సాధించడం విశేషం. సౌత్ లో 10 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న తొలి హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన 'సాహో' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు.  
prabhas

More Telugu News