పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు, పక్కపక్కనే ఇళ్లు... తడికలను అడ్డం పెట్టిన పోలీసులు!
- స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య
- మహాకూటమి తరఫున బరిలోకి దిగిన ఇందిర
- ఆసక్తికరంగా మారిన పోరు
ఇంకేముంది, అనుక్షణం అక్కడ సందడే సందడి. విమర్శలు, ప్రతి విమర్శలూ కామన్. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా, రెండు ఇళ్ల మధ్యా తడికలను ఏర్పాటు చేశారు. ఒక పార్టీ కార్యకర్తలు, మరో పార్టీ కార్యకర్తలకు కనిపించకుండా చూసేందుకే ఈ ఏర్పాటు చేశామని అంటున్నారు. ఏది ఏమైనా ఈ దఫా ఎన్నికల్లో అన్నా చెల్లెళ్ల మధ్య పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.