అభిమానులకు వడ్డీతో పాటు తిరిగిచ్చేస్తా: హీరో రామ్
Add ap7am to your home Screen

అభిమానులకు వడ్డీతో పాటు తిరిగిచ్చేస్తా: హీరో రామ్

  • రామ్ హీరోగా వచ్చిన 'హాలో గురు ..'
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • హిట్ ఇచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు      
హీరో రామ్ కి యూత్ లో మంచి క్రేజ్ వుంది. తన సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా ఆయన ప్రాధాన్యతను ఇస్తుంటాడు. అందువలన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రామ్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వరుస పరాజయాల తరువాత ఇటీవలే ఆయన నుంచి 'హలో గురు ప్రేమకోసమే' సినిమా వచ్చింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.

తాజాగా ఈ సినిమాను గురించి రామ్ ఒక ట్వీట్ చేశాడు. 'అంతగా శాటిస్ ఫై చేయలేకపోయినా సపోర్ట్ చేసి, 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాను హిట్ చేశారు. అందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా నుంచి నా అభిమానులు ఆశించేది ఈ సారి వడ్డీతో పాటు తిరిగిచ్చేస్తా" అన్నాడు. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.          
ram
anupama

More Telugu News