నేడే తుది జాబితా... తుది కసరత్తుకు కూర్చున్న ఉత్తమ్!
- న్యూఢిల్లీలోనే మకాం వేసిన ఉత్తమ్
- ఏఐసీసీ నేతలతో భేటీ
- సాయంత్రానికి తుది లిస్టు!
కాగా, ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నాలుగు రోజుల్లోనూ ఒక రోజు ఆదివారం కావడంతో, మూడు రోజులే ఉన్నట్టు లెక్క. ఇప్పటికింకా అభ్యర్థుల జాబితా ఫైనల్ కాకపోవడం, 75 పేర్లను మాత్రమే ప్రకటించడంతో, పెండింగ్ సీట్లలోని ఆశావహులు ఆత్రుతతో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది.
అభ్యర్థుల జాబితాను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి, తాను కూడా హైదరాబాద్ చేరుకుని ప్రచార రంగంలోకి దిగుతానని ఈ ఉదయం ఉత్తమ్ వ్యాఖ్యానించారు. టికెట్ దక్కని వారు అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదని, వారి అర్హతను బట్టి సముచిత స్థానం ఇస్తామని ఆయన అన్నారు.