సోనియాను దెయ్యం, అవినీతి అనకొండ అని తిట్టిన చంద్రబాబుతో పొత్తెలా పెట్టుకుంటారు?: కేటీఆర్
- ముసలి నక్క, గుంటనక్క ఒక్కటయ్యాయి
- కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా నిర్మిస్తున్నాం
- పెన్షన్ తీసుకునే వయసును 58 ఏళ్లకు తగ్గిస్తాం
ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు కేసులు వేసినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా నిర్మిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితి ఉండేదని.. తమ ప్రభుత్వ హయాంలో అటువంటి పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. పెన్షన్ తీసుకునే వయసును 58 ఏళ్లకు తగ్గిస్తామని.. మళ్లీ అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్‌ను రూ.2016కు పెంచుతామని కేటీఆర్ తెలిపారు.