ముంచుకొస్తున్న మరో తుపాను.. తీరం వెంబడి బలమైన గాలులు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
- మరో 24 గంటల్లో బలపడనున్న తుపాను
- జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
- అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ
ప్రస్తుతం అన్ని పోర్టులలోనూ రెండో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడతాయని, తీరం వెంబడి ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలోనూ పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.